![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ హౌస్ లో ట్విస్ట్ లకి కోదవ లేదు. ఆపిల్ చెట్టుకి వున్నా ఆపిల్స్ ని అందరు తీసుకున్న విషయం తెలిసిందే.. ఒక రకం గింజ వచ్చినవారికి టాస్క్ పెట్టి.. ఫ్యామిలీ సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇక నలుపు గింజ వాళ్ళకి బిగ్ బాస్ ఇమ్మ్యూనిటి ఇచ్చాడు. రీతూ, ఫ్లోరా, శ్రీజ ముగ్గురు నలుపు గింజని పొందారు.
ముగ్గురికి బిగ్ బాస్ టాస్క్ ఇచ్చాడు. సంఛాలక్ నెట్ బయట నుండి బాల్ వేస్తె అది పట్టుకొని బయటకి వచ్చి తమకి కేటాయించిన బాక్స్ లో పెట్టాలి. ఆ తర్వాత వాటిని ఒక జోన్ లో వెయ్యాలి. ఎవరైతే మూడు వేస్తారో వాళ్ళు ఇమ్మ్యూనిటి పొంది నామినేషన్ నుండి తప్పుకుంటారని బిగ్ బాస్ చెప్తాడు. సంఛాలక్ గా సంజన ఉంటుంది. సంజన బాల్ వేస్తుంది.. లోపలున్న రీతూ, శ్రీజ, ఫ్లోరా బాల్ కోసం పోటీ పడుతారు. అలా రీతూ నాలుగు, ఫ్లోరా మూడు, శ్రీజ ఒకటి వేస్తుంది.
ఆ తర్వాత రీతూ తనకి సంబంధించిన జోన్ లో ఒక బాల్ మత్రమే వేస్తుంది. ఫ్లోరా మాత్రం మూడు బాల్స్ వేసి ఇమ్మ్యూనిటీ సాధిస్తుంది. రీతూ పక్కకి వెళ్లి ఏడుస్తుంది. ఫైట్ చేసి నాలుగు బాల్స్ సాధించింది రీతూ కానీ అందులో వెయ్యలేకపోయిన నాకు లక్కే లేదంటూ రీతూ ఏడుస్తుంటే అందరు వచ్చి ఓదారుస్తారు. టాస్క్ మధ్యలో శ్రీజ , రీతూల మధ్య గొడవ అవుతుంది. నీలాగా నేను బూతులు మాట్లాడలేనని శ్రీజ అనగానే రీతూ హర్ట్ అవుతుంది. ఆ విషయం తీస్తూ తనూజతో చెప్తూ రీతూ ఎమోషనల్ అవుతుంది. నిన్నటి ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
![]() |
![]() |